Breaking News

Mega good news in Pithapuram

పిఠాపురంలో మెగా శుభవార్త

పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉపాసన ప్రాజెక్ట్

పవన్ కళ్యాణ్ ఇలాకాలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కీలక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ కు ఉపాసన కూడా తన అపోలో సంస్థ ద్వారా మద్దతు ఇవ్వనున్నారు. ఈ విషయంపై పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉపాసన సేవా కార్యక్రమాలు

ఉపాసన, అపోలో సంస్థ తరపున “మదర్ హుడ్” అనే ప్రోగ్రామ్‌ను పిఠాపురంలో ప్రారంభించబోతున్నారు. ఇది అపోలో మెడికల్ కాలేజీ మరియు అపోలో ఫౌండేషన్ సహకారంతో మోడల్ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రాథమిక ఉద్దేశం:

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • తల్లులకు, పుట్టిన పిల్లలకు మంచి ఆరోగ్యం మరియు న్యూట్రీషియన్ ఫుడ్ అందించడం.
  • అక్కడి మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
  • తల్లి సంరక్షణ, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం.

ప్రాజెక్ట్ విస్తరణ

ఈ ప్రాజెక్ట్‌ను పిఠాపురంలో ప్రారంభించి, 109 అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరించాలని ఉపాసన నిర్ణయించారు. ఈ సేవా కార్యక్రమం మెగా అభిమానులతో పాటు పిఠాపురం ప్రజల ఆదరణ పొందుతోంది.

ప్రశంసలు:

పిఠాపురంలో ఉపాసన చేసిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు తోడుగా, ఉపాసన చేస్తున్న సేవలను ప్రజలు ఆనందంగా స్వీకరిస్తున్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *