Breaking News

Massive joins from YCP to TDP in Pulivendulu

పులివెందులలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

సొంత నియోజకవర్గంలో జగన్‌కు షాక్

📍 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు భారీగా టీడీపీలో (TDP) చేరుతున్నారు.

పులివెందులలో వైసీపీకి చెందిన 30వ డివిజన్ కౌన్సిలర్ సాహిదా, మరో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
✅ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆధ్వర్యంలో వీరంతా టీడీపీలో చేరగా, ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
✅ ఈ చేరికలతో వైసీపీ కేడర్‌ అయోమయంలో పడింది.

✅ కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలోనూ వైసీపీకి చెందిన ముగ్గురు మహిళా కౌన్సిలర్లు ఇవాళ టీడీపీలో చేరారు.
✅ తేటగుంట టీడీపీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వారికి పసుపు కండువా కప్పి స్వాగతం పలికారు.
✅ వైసీపీ ప్రభుత్వ తీరుతో తీవ్ర అసంతృప్తి కారణంగానే తాము టీడీపీలో చేరుతున్నట్టు ఈ కౌన్సిలర్లు వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

వైసీపీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

➡️ రానున్న ఎన్నికలకు ముందు ఇలా వైసీపీకి ఎదురుదెబ్బలు తగలడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. 🚨

https://youtu.be/MMAcT23nWSY

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *