Breaking News

Jagan Reddy is a traitor to the farmers who made pepper farmers go nuts

మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం
గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మీడియా సమావేశం వివరాలు :

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి అని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘జగన్ రెడ్డి పాలనలో మిర్చి యార్డులోని జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాల మీద సమాధానం బాధ్యత ఆయనపై ఉంది. దాపు రూ.2000 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించిన ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ ప్రాథమిక విచారణలో భాగంగా రూ.350 కోట్ల అవినీతి జరిగినట్లు కూడా అధారాలు సేకరించారు. ఈ రూ.350 కోట్లు మాత్రమే కాదు.. ఇంకా రూ.1500 కోట్ల అవినీతి వెలుగు చూడాల్సి ఉంది. మిర్చి యార్డులో ప్రతి ఏటా రూ.20,000 కోట్ల వ్యాపారం లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1శాతం సెస్సు వ్యాపారులు చెల్లించాల్సిన ఉంది. దాని ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు అంటే ఐదేళ్లలో రూ. 1000 కోట్లు రావాలి.. జీఎస్టీ ద్వారా మరోక రూ.2000 కోట్లు రావాలి.. ఇందులో సగం మాత్రమే మిర్చి యార్డులో జమ అయింది. మిగతా మొత్తం కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, అధికారులు స్వాహా చేశారు. అదే కాకుండా 400 లైసెన్సులు రిన్యూవల్ చేస్తే ఒక్కోక్క దానికి రూ.50,000 నుంచి లక్ష వరకు వసూలు చేశారు. 160 లైసెన్సులను ఒక పేరు నుంచి మరో పేరుకు బదిలీ చేసేందుకు.. ఒక్కోక్క లైసన్సు నుంచి రూ.10 లక్షలు వసూలు చేశారు. వైసీపీ సానుభూతిపరులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో.. వారు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వరకు ఎగనామం పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత వారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి 2019-20, 2020-21, 2021-22లో ధరలు ఎంత ఉన్నాయి.. ఇప్పటి ధరలు ఎంత ఉన్నాయి.. ఆయన రూ.20,000లు ఉన్నాయన్నారు.. కానీ, అంత లేదు.. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వీంటల్ రూ.7000 ఎంఎస్‌పీ (మినిమం సపోర్ట్ ప్రైస్)గా నిర్ధారించి మిర్చి యార్డులో బోర్డు కూడా పెట్టించారు. మరి ఆయన అంటున్న రూ.20,000లు కేవలం ఒక్క ఏడాది మాత్రమే కొనుగోలు జరిగాయి. ఈ విధంగా జగన్ రెడ్డి మిర్చి యార్డులో మాట్లాడినవి అన్ని కూడా పచ్చి అబద్దాలు.. ముందు అక్కడ జరిగిన అవినీతి మీద మాట్లాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే.. తన పార్టీకి చెందిన నాయకులే ప్రధానంగా ఈ అవినీతి పాలు పంచుకున్నారు. 2017లో నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.6000 నుంచి రూ.8000 ధర పలుకుతున్నప్పుడు.. ఈ ధర చాలదు.. మనం మద్దతు ధర ప్రకటించాలి.. రైతాంగానికి బోనస్ ఇవ్వాలని చెప్పి అప్పటి సీఎం చంద్రబాబు రూ.129 కోట్లు విడుదల చేసి.. దాదాపుగా 56000 మంది రైతులను అదుకున్నారు. సుమారు 87వేల మెట్రిక్ టన్నుల మిర్చిని అ రోజు కొనుగోలు చేశాం. అంటే ఒక్కోక్క రైతుకు రూ.30,000 లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు కృషి చేశారు.. జగన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఏ పంటకి అయిన బోనస్ ప్రకటించావా..? నీకు అసలు ఎంఎస్‌పీనే ఎంత ప్రకటించాలో కూడా నీ కనీస అవగాహన లేదు.. అంతే కాకుండా ఏ పంట పట్ల కూడా నీకు అవగాహన లేదు. నిన్న మిర్చి యార్డుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యావ్.. ఇంకా అరగంట గానుక అలస్యం అయితే నువ్వు రైతులను పరామర్శంచడం కాదు.. రైతులు నిన్ను పరామర్శించే స్థాయికి పరిస్థితి వచ్చేది. ఏ పంట ఎలా పండింది.. ఏ పంట ఎక్కడ పండుతుంది.. ఎంత ఖర్చు అవుతుంది.. ఎంత పెట్టుబడి పెట్టాలి.. కనీస అవగాహన లేదు నీకు.. అలాంటి మిర్చి యార్డులోకి వచ్చి రైతులను పరామర్శ పేరుతో వచ్చి రైతులపై దండయాత్ర చేసినట్లు ఉంది.. రైతులను వైసీపీ గుండాలు, అక్కడికి వచ్చినటువంటి కిరాయి గుండాలు, రౌడీలు, చుట్టుపక్కలు ఉన్న సంఘ విద్రోహ శక్తులు అన్ని కూడా అక్కడికి చేరుకుని రైతులపై దాడులు చేశారు.. రైతుల మిర్చి టిక్కిలు ఎత్తుకువెళ్లారు. అక్కడ ఉన్న రైతులకు ఏ మాత్రం సహాయ పడకపోగా.. అక్కడికి వచ్చి.. అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలను గానీ, అమ్మాకాలను గానీ, అక్కడకు వస్తున్న సరుకును అంత కూడా నానా హంగామా చేశారు. రాజకీయ లబ్ధి కోసం, సీఎం చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద బురద జల్లేందుకు వచ్చినట్లు ఉంది తప్పితే రైతులకు ఏ మాత్రం మేలు చేసేందుకు వచ్చినట్లు అయితే లేదు.. నిజంగా రైతులకు మేలు చేయలంటే అసెంబ్లీ వేదికగా ఉంది.. వచ్చే 24 నుంచి శాసనసభ సమావేశాలు మొదలు అవుతున్నాయి. అక్కడికి వెళ్లి రైతు సమస్యలపైన, ప్రజా సమస్యలపైన నీ వాణి వినిపించు.. నువ్వు అక్కడ గట్టిగా నిలబడు.. అక్కడ మాట్లాడు.. అక్కడ మాట్లాడకుండా పులివెందుల ప్రజలు ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపిస్తే.. అసెంబ్లీలో మాట్లాడు.. నువ్వు మిర్చి యార్డుకు వచ్చి మాట్లాడితే కేవలం రాజకీయ లబ్ధ కోసమే కానీ, ఏ మాత్రం కూడా రైతాంగానికి మేలు చేద్దామని ఆలోచనే లేదు.. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖాలలు లేవు.. 2019-2022 మధ్య కాలంలో ధరలు పూర్తిగా పడిపోయాయి.. అ రోజు మీరు మిర్చి యార్డును సందర్శించారా..? కనీసం ఒక్క మాట అయిన మాట్లాడావా..? అలాంటిది ఇప్పుడు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది.? ఈ విధంగా అవినీతిపరులను, దొంగలను, దోపిడిదారులను నువ్వు ప్రోత్సాహస్తు వారిని రైతుల మీద పంపి దోచుకుంటూ ముసలి కన్నీరు కార్చుతున్నాడు..’’ అని అన్నారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *