బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అనంతపురం అభివృద్ధికి AMCA ప్రాజెక్ట్ ‘రిటర్న్ గిఫ్ట్’: మంత్రి నారా లోకేష్

అనంతపురం అభివృద్ధికి AMCA ప్రాజెక్ట్ ‘రిటర్న్ గిఫ్ట్’: మంత్రి నారా లోకేష్

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌తో అనంతపురం జిల్లా భవిష్యత్తు మారబోతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఉమ్మడి అనంతపురం జిల్లాకు “రిటర్న్ గిఫ్ట్”గా అభివర్ణించారు.పుట్టపర్తిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ, కియా పరిశ్రమ తర్వాత ఇప్పుడు ఫైటర్ జెట్ తయారీ కేంద్రం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. రాయలసీమ కరువు నేలపై పరిశ్రమల విప్లవం జరుగుతోందని చెప్పారు.AMCA ప్రాజెక్ట్ ద్వారా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. DRDO, HAL సహా పలు రక్షణ రంగ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో పుట్టపర్తి దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారనుందని అన్నారు.చంద్రబాబు నాయుడు దూరదృష్టి కారణంగానే కియా వంటి పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, ఇప్పుడు అదే విజన్‌తో డిఫెన్స్ రంగం కూడా ఏపీకి వస్తోందని లోకేష్ తెలిపారు. ఇది కేవలం పరిశ్రమ కాదు, రాయలసీమ భవిష్యత్తుకు కొత్త దిశ అని వ్యాఖ్యానించారు.ఇక రాజకీయ విమర్శల నేపథ్యంలో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిని గుర్తించాల్సిన అవసరం ఉందని, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్