Breaking News

ఇంధన సరఫరాపై నిరంతర సమీక్షలు: మంత్రి నాదెండ్ల మనోహర్

మే 15, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో మాట్లాడిన ఆయన.. ప్రజలకు ఎలాంటి ఇంధన కొరత తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోందన్నారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగానే జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అవసరమైన నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. ఇంధనాన్ని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ధరల నియంత్రణ కోసం అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *