మే 15, (నేటి తెలుగు పత్రిక): కర్నూలులో ఇటీవల జరిగిన ఆందోళనలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని చిన్న అంశాలను పెద్దదిగా చూపిస్తూ వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు.మీడియాతో మాట్లాడిన ఆమె.. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారని విమర్శించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు చర్యలు తీసుకుంటే వాటిని రాజకీయ రంగు పులమడం సరైంది కాదన్నారు.కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని సమర్థించడం సరికాదని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎవరినీ వదిలిపెట్టబోదని స్పష్టం చేశారు.పోలీసుల పనితీరుపై అనవసర విమర్శలు చేయకుండా చట్టానికి సహకరించాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత రాజకీయాలు అవసరమని బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
