Breaking News

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుైంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ శేషయ్య తెలిపారు.మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన వైసీపీ ధర్నా సందర్భంగా మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఉన్నాయని మంత్రి తన ఫిర్యాదులో వెల్లడించారు.ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ప్రసంగాల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *