మే 22, (నేటి తెలుగు పత్రిక): లోకేశ్ మాజీ సీఎం జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ తరచూ బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ మధ్య ప్రయాణాలు చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఆయనకు సరదాగా ‘బెంతా హై’ అనే పేరు పెట్టానని వ్యాఖ్యానించారు.జగన్ నటనకు ఏ అవార్డు అయినా ఇవ్వొచ్చని, ‘భాస్కర్ అవార్డు’ స్థాయిలో ఆయన నటిస్తున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో డ్రామాలు, భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.‘జగన్ సినిమా చూపిస్తే ఎండ్ కార్డు వేసే బాధ్యత మా కేడర్‌ది’ అంటూ టీడీపీ శ్రేణులు బలంగా ఎదుర్కొంటాయని లోకేశ్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
