Breaking News

రైలులో ప్రయాణం.. సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి మంత్రి నిమ్మల

మే 22, (నేటి తెలుగు పత్రిక): ‘నో వెహికల్ డే’ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి ప్రజారవాణాను వినియోగించారు. పాలకొల్లులో నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రైలులో విజయవాడకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి సైకిల్‌పై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణించిన మంత్రి, వరుసగా రెండో వారం కూడా ‘నో వెహికల్ డే’ను కొనసాగించారు. తాడేపల్లి వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధిని చూసి జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు హింసాత్మక రాజకీయాలను తిరస్కరిస్తారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *