బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రజల మధ్యనుంచి గవర్నర్ స్థాయికి.. దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ

ప్రజల మధ్యనుంచి గవర్నర్ స్థాయికి.. దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ

మే 24, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలోని మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా నిర్వహించారు. రాజకీయ జీవితం, ప్రజాసేవ, సామాన్యులతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సభలో పుస్తకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. సాధారణ కుటుంబం నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి గవర్నర్ స్థాయికి చేరుకున్న బండారు దత్తాత్రేయ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ప్రజల ఆశీస్సులే తన జీవితానికి బలమని చెప్పారు. అందుకే తన ఆత్మకథకు ‘ప్రజల కథే నా ఆత్మకథ’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్