Breaking News

పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం: మంత్రి అనగాని సత్యప్రసాద్

మే 24, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరో్యగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తున్నామని చెప్పారు.విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 63 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్వోసీలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదల పాలిట సంజీవనిలా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో సహాయనిధి చెక్కులు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.ఇప్పటివరకు ఈ ప్రాంత ప్రజలకు సీఎం సహాయనిధి రూపంలో సుమారు రూ.8 కోట్ల సాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సేవలను మంత్రి ప్రశంసించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు.విజయవాడలో త్వరలో 22 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వచ్చే ఒకటి, రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *