బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంధన ధరల పెంపుపై మోదీ, చంద్రబాబుపై షర్మిల విమర్శలు

ఇంధన ధరల పెంపుపై మోదీ, చంద్రబాబుపై షర్మిల విమర్శలు

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం అత్యంత దారుణమని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మోదీజీ లూటీదారు.. దేశ ప్రజలను దోచడంలో ఆయనను మించినవారు లేరు” అంటూ విమర్శించారు. ఇంధన ధరల పెంపుతో రోజుకు రూ.1,000 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతోందని ఆరోపించారు.దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని పేర్కొన్న షర్మిల.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యాట్ తగ్గించాలంటూ కోరుతున్నప్పటికీ సీఎం చంద్రబాబు స్పందించడం లేదని విమర్శించారు.ఇంధనంపై విధిస్తున్న రూ.4 వ్యాట్‌తో పాటు రూ.1 రోడ్ సెస్సును కూడా వెంటనే రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్