బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇక సహనం లేదు.. హెచ్చరించిన పవన్ కళ్యాణ్

ఇక సహనం లేదు.. హెచ్చరించిన పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. జనసేన పార్టీపై, తనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఇక సహించబోనని హెచ్చరించారు. “దారినపోయేవాళ్లు జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను. ఇప్పటివరకు అన్నీ భరించా.. ఇక ఓపిక లేదు” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశ్లేషకులను ప్రశ్నిస్తే వెంటనే కుల రాజకీయాలు తెరపైకి తీసుకురావడం సరైంది కాదని అన్నారు. “ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా? మాకు కోపం రాదా?” అని ప్రశ్నించారు.అధిక సహనం కొన్నిసార్లు చేతగానితనంగా మారుతుందని వ్యాఖ్యానించిన పవన్.. “కర్మ ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇటీవల ప్రొ. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్