Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం: సీఎం చంద్రబాబు

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధిని గ్రామస్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 175 ఎంఎస్ఎంఈ పార్కుల దార్శనికతలో భాగంగా తొలి దశలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా యువతే రాష్ట్రానికి అతిపెద్ద బలం, సంపద అని సీఎం పేర్కొన్నారు. యువతలో సహజసిద్ధమైన వ్యాపార స్ఫూర్తి, ప్రతిభ, ఆశయాలను వెలికి తీయడానికి ప్రభుత్వం అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తూ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని చెప్పారు.ప్రతి నియోజకవర్గానికి పరిశ్రమలను విస్తరించడం ద్వారా ఆర్థిక అవకాశాలను వికేంద్రీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఉద్యోగాలు, పెట్టుబడులు, వ్యాపార అవకాశాలను ప్రజలకు మరింత చేరువ చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమాన అభివృద్ధి చేరేలా చూడటమే కాకుండా, ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు వ్యాపారం ప్రారంభించేందుకు, అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు, సహాయక వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *