Breaking News

ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత.. ముగ్గురు బ్యాటర్ల నుంచి 700+ పరుగులు

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్-2026 సీజన్ బ్యాటర్ల ఆధిపత్యానికి వేదికగా నిలిచింది. ఈ సీజన్‌లో పరుగుల వరద పారుతుండగా, టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా ముగ్గురు బ్యాటర్లు ఒకే సీజన్‌లో 700కుపైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు.వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరచగా, శుభ్‌మన్ గిల్ 722* పరుగులు, సాయి సుదర్శన్ 710* పరుగులతో సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చారు.అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టు నుంచి ఇద్దరు బ్యాటర్లు 700కుపైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. Gujarat Titans తరఫున గిల్, సాయి సుదర్శన్ ఈ ఘనత సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సీజన్‌లో భారీ స్కోర్లు, వరుస సెంచరీలు, రికార్డు భాగస్వామ్యాలతో బ్యాటర్లు అభిమానులను అలరించగా, 700+ పరుగుల క్లబ్‌లో ముగ్గురు చోటు దక్కించుకోవడం ఐపీఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఈ స్టార్ బ్యాటర్ల ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

రేపే ఐపీఎల్ ఫైనల్.. టైటిల్ ఎవరికి?

నేడే రెండో అర్హత పోరు.. తుది సమరానికి చేరేదెవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *