Breaking News

Celebrations in pushpa style.. Ambati Rambabu satires on CM

పుష్ప స్టైల్‌లో సెలబ్రేషన్స్‌.. సీఎంపై అంబటి రాంబాబు సెటైర్లు

తెలుగు కుర్రాడి పుష్ప స్టైల్‌ సెలబ్రేషన్‌ హైలైట్‌: నితీశ్‌ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు

మెల్‌బోర్న్‌: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్ట్‌ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ నితీశ్‌ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్‌, కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకొని తన దూకుడు ఆటతో అన్ని వర్గాలను ఆకట్టుకున్నాడు. 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో శతకం పూర్తి చేసిన నితీశ్‌ తన అర్ధ శతక సమయంలో చేసిన ‘పుష్ప స్టైల్‌’ సెలబ్రేషన్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మేనరిజంతో ‘తగ్గేదేలే’ అంటూ సంబరాలు చేసుకున్న వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

మంత్రి నారా లోకేష్ చొరవతో ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ అభివృద్ధి

పుష్ప ప్రభావంపై అంబటి రాంబాబు స్పందన
నితీశ్‌ సెలబ్రేషన్‌ వీడియోపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికరంగా స్పందించారు. “ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న పుష్ప.. హీరోని వేధిస్తూ, తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా?” అంటూ ఎక్స్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌లో నితీశ్‌ వీడియోను కూడా షేర్‌ చేశారు.

పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *