Breaking News

Clarity on resignations.. Ayodhya Ramireddy's unnecessary campaign

రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి

వైసీపీ రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి

హైదరాబాద్:
వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టతనిచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న అయోధ్య రామిరెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, “నా రాజీనామాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం. అది పూర్తిగా తప్పుడు సమాచారం” అంటూ ఖండించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

విజయసాయిరెడ్డి రాజీనామా నేపథ్యం:
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీకి చెందిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.

ఊహాగానాలకు తెరపడిన అయోధ్య రామిరెడ్డి:
తన రాజీనామా వార్తలను ఖండించిన అయోధ్య రామిరెడ్డి, “వైసీపీ పార్టీతో నేను కొనసాగుతున్నా. రాజీనామాపై జరుగుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం” అని అన్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

రాజీనామాలపై ఉత్కంఠత:
ఢిల్లీ ఆపరేషన్‌లో భాగంగా ఎన్డీఏ వ్యూహం మేరకు రాజ్యసభలో తమ బలం పెంచుకునే క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామా చేస్తారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాలు నిజమా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా వైసీపీ నేతలు రాజ్యసభ సభ్యుల రాజీనామా ఊహాగానాలను ఖండిస్తూ, వారు పార్టీలోనే కొనసాగుతారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *