Breaking News

ఎన్టీఆర్ సిద్ధాంతాలే మార్గం.. టీడీపీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన విడుదల చేసిన సందేశంలో, యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ తరతరాల తెలుగు ప్రజల ఆశయాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు.పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించాలనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని తమ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, ఆవిర్భావ దినోత్సవం ప్రతి కార్యకర్తకు ఇంటి పండుగలాంటిదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *