బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

“కాకినాడ రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి”

“కాకినాడ రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి”

మే 16, (నేటి తెలుగు పత్రిక): కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు దాటుతున్న ఉపాధి హామీ మహిళా శ్రామికులను టిప్పర్ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పరిహారం త్వరితగతిన అందజేస్తామని చెప్పారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల సహాయం, అలాగే పీఎం సురక్ష యోజన, పీఎం జీవన్ జ్యోతి యోజన కింద బీమా ప్రయోజనాలు కూడా అందుతాయని వెల్లడించారు.ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, బైపాస్ రోడ్లు, ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించాలని సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్