బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

YCP విధ్వంసం మరిచిపోతే మళ్లీ గొడ్డలి వేటే: సీఎం చంద్రబాబు హెచ్చరిక

YCP విధ్వంసం మరిచిపోతే మళ్లీ గొడ్డలి వేటే: సీఎం చంద్రబాబు హెచ్చరిక

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో రాష్ట్రంలో “టెర్రరిజం తరహా విధ్వంస పాలన” కొనసాగిందని ఆరోపించిన ఆయన, ఆ కాలాన్ని ప్రజలు మరిచిపోతే భవిష్యత్తులో మళ్లీ తీవ్రమైన అనర్థాలు తప్పవని హెచ్చరించారు.శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ప్రజా సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. “విధ్వంసాన్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ గొడ్డలి వేటు తప్పదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఫేక్ న్యూస్, దుష్ప్రచారాల ద్వారా సమాజంలో అశాంతి సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆరోపించారు. NCRB గణాంకాలను ఉటంకిస్తూ, ఫేక్ న్యూస్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇది YCP చేస్తున్న దుష్ప్రచారాల తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు.కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయని, వాటిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అభివృద్ధి అడ్డుకుపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని సీఎం హెచ్చరించారు. గత అనుభవాలను గుర్తుంచుకుని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్