బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు నిర్వహణ: మంత్రి కొల్లు రవీంద్ర

ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు నిర్వహణ: మంత్రి కొల్లు రవీంద్ర

మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నెల్లూరులో జరగాల్సిన మహానాడును మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.పోలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో మహానాడు నిర్వహించబడుతుందని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్లస్టర్ వారీగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ప్రత్యక్ష ప్రసారం చూపించనున్నట్లు చెప్పారు.యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. మహానాడు ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కీలక నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేస్తామన్నారు.ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కొల్లు రవీంద్ర చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మానిటరింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్