బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జూన్‌ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు

జూన్‌ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వితంతువులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్‌ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.అర్హులైన మహిళలకు పారదర్శకంగా పింఛన్లు అందిస్తామని, ఆన్‌లైన్‌ ద్వారా నమోదు సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియలో సహాయం అందించనున్నట్లు చెప్పారు.రెవెన్యూ సమస్యల కారణంగా చాలా మంది అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి అందలేదని పేర్కొన్న మంత్రి, పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ఈ కొత్త పింఛన్లు వితంతువులకు ఆర్థికంగా ఊరటనివ్వనున్నాయని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. త్వరలోనే అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానంపై ప్రభుత్వం పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్