బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు ఆదేశాలతో పాస్‌పోర్ట్‌ సమర్పించిన విడదల రజిని

హైకోర్టు ఆదేశాలతో పాస్‌పోర్ట్‌ సమర్పించిన విడదల రజిని

మే 17, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి విడదల రజిని తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్ట్‌ను పోలీసులకు సమర్పించారు. ఆదివారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆమె అధికారులకు పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదు మేరకు యడ్లపాడు పోలీసులు విడదల రజిని, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు భయంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని షరతు విధించింది.కోర్టు ఆదేశాలను పాటిస్తూ డీఎస్పీ హనుమంతరావుకు పాస్‌పోర్ట్‌ను అందజేసిన రజిని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.రజిని రాక నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్