బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి ట్వీట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు: దేవినేని ఉమా ఫైర్‌

తాడేపల్లి ట్వీట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు: దేవినేని ఉమా ఫైర్‌

మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి కేంద్రంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పకుండా ట్వీట్లతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తుండటాన్ని కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు.పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులపై విషప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై గతంలో విమర్శలు చేసిన వారే ఇప్పుడు అక్కడి అభివృద్ధిని చూసి మౌనం వహిస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమిదేనని పేర్కొన్నారు.అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది పేదలకు ఆహారం అందించామని గుర్తుచేసిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గుంతలు కూడా పూడ్చలేని వారు ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్