బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ లాసెట్-2026 ఫలితాలు విడుదల.. 80% ఉత్తీర్ణత

ఏపీ లాసెట్-2026 ఫలితాలు విడుదల.. 80% ఉత్తీర్ణత

మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విద్యకు సంబంధించిన ఏపీ లాసెట్ (AP LAWCET) మరియు ఏపీ పీజీ ఎల్‌సెట్ (AP PGLCET) 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh సోమవారం విడుదల చేశారు. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు.ఈ ఏడాది నిర్వహించిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 23,996 మంది హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 80గా నమోదైంది.ఏపీ లాసెట్ ద్వారా మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, ఐదు సంవత్సరాల సమగ్ర న్యాయ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించగా, పీజీ ఎల్‌సెట్ ద్వారా ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేసి ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు, కాలేజీ ఎంపికకు సంబంధించిన వివరాలను అధికారిక ప్రకటనల ద్వారా వెల్లడించనున్నారు.“న్యాయ విద్య ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి” అని మంత్రి లోకేశ్ విద్యార్థులకు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్