మే 20, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులాల ఆధారిత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కులగణన నిర్వహించాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. వెనుకబడిన వర్గాల జనాభా, వారి సామాజిక పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అవసరమని వ్యాఖ్యానించింది.కులాల ఆధారంగా జనగణన చేపట్టడంపై కోర్టు జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రభుత్వ విధానాల్లో న్యాయస్థానం జోక్యం పరిమితంగానే ఉంటుందని పేర్కొంది.ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన అంశంపై రాజకీయ, సామాజిక చర్చ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
