Breaking News

విజయ్ మూవీలో ట్రాఫిక్ పోలీస్.. ఇప్పుడు రవాణా మంత్రి!

మే 22, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు, ముఖ్యమంత్రి Vijay నటించిన “ది గోట్” సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించిన తమిళన్ పార్తిబన్ ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.సేలం సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పార్తిబన్‌కు సీఎం విజయ్ తన కేబినెట్‌లో చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎలక్ట్రీషియన్‌గా జీవితం ప్రారంభించిన పార్తిబన్, విజయ్‌కు ఎన్నాళ్లుగానో వీరాభిమాని అని తెలుస్తోంది.విజయ్‌తో ఉన్న దీర్ఘకాల అనుబంధం కారణంగా ముందుగా సినిమాల్లో అవకాశాలు వచ్చిన పార్తిబన్‌కు, ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక బాధ్యత దక్కడం విశేషంగా మారింది. అభిమానులు దీనిని “సినిమా నుంచి నిజ జీవితానికి వచ్చిన కథ”గా అభివర్ణిస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా ఈ అంశం వైరల్ అవుతోంది. “విజయ్ తన మనుషులను మరవడు”, “అభిమానిని మంత్రిగా తీర్చిదిద్దిన నాయకుడు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *