ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ఆపా లని స్పష్టంచేసాం..!
విజయవాడ. మే 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర సచివాలయం, అమరావతి నందు TR&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇన్‌చార్జ్ PTD కమిషనర్ & ఆర్టీసీ ఎండీ శ్రీ ఎం.టి. కృష్ణబాబుతో ఆర్టీసీ గుర్తింపు ఉద్యోగ సంఘాలైన ఏపిపీటిడీ నేషనల్ మజ్దూర్ యూని టీ అసోసియేషన్ (NMUA), ఏపిపీటిడీ ఎంప్లాయీస్ యూనియ న్ (EU) రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ద్వారానే నిర్వహిం చాలని, విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తు లకు అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని కోరడమై నది. అలాగే స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులకు ఏర్పడుతున్న ఇబ్బందుల ను తొలగించాలని, 3000 కొత్త బస్సులను ప్రవేశ పెట్టి 10,000 ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేయ డమైనది. స్త్రీ-శక్తి పథకం మరింత విజయవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది. సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవా లని, దాడులకు పాల్పడి న వారిపై కఠిన శిక్షలు విధించాలని సమావేశం లో డిమాండ్ చేయడమై నది. మెకానిక్‌లకు 12 AAS వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసి, లీడింగ్ హ్యాండ్ స్కేల్ అమలు చేయాలని కోరడమైనది. ఉద్యోగ భద్రత సర్క్యులర్ నెం.01/2019ను అమ లు చేసి ఉద్యోగులకు విధి స్తున్న తీవ్రమైన శిక్షల నుంచి విముక్తి కల్పించా లని విజ్ఞప్తి చేయడమైన ది. కాలం చెల్లిన (TIMS) టి ఐ ఎం ఎస్ స్థానంలో కొత్త TIMS అందించాల ని, కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ ఆసుప త్రులు ఏర్పాటు చేయాల ని కోరడమైనది. ఉద్యోగు లకు సంబంధించిన సంక్షేమము వైద్యము ప్రమోషన్లు తదితర అంశ ముల మీద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పా టు చేసి కమిటీ రిపోర్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు కు చర్యలు తీసు కుంటా మని కూడా తెలి యజేసి ఉన్నారు.అంతేకాకుండా, రెండు గుర్తింపు సంఘాలు సమర్పించిన మెమోరాం డాల్లోని అన్ని అంశాలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చర్చలు జరపాల ని కోరడమైనది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఉద్యోగు లు ఆందోళన చెందవద్ద ని, ఉద్యోగుల ఆందోళన లను సీఎం దృష్టికి తీసు కెళ్తామని కృష్ణబాబు హామీ ఇచ్చారు. అయిన ప్పటికీ, ఈ చర్చల సారాం శాన్ని ఇతర సంఘాలతో చర్చించి, ఆర్టీసీ ప్రైవేటీక రణపై స్పష్టమైన హామీ కోసం భవిష్యత్ ఆందోళ న కార్య క్రమాలపై చర్చిం చి తదు పరి నిర్ణయాలు ప్రకటిస్తా మని సమావేశం అనంత రం మీడియాతో NMUA రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, ఆర్టీసీ EU రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, ఎన్ ఎం యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి. రమణా రెడ్డి, ఆర్టీసీ ఈ యూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి జి.వి. నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ డి (అడ్మిన్) బ్రహ్మనంద రెడ్డి, ఈ డి (ఆపరేషన్స్) ఎం.వై. దానం, ఈడి ఇంజనీరింగ్ జి.వి. రవివర్మ, FA & CAO సుధాకర్, CPM శ్రీధర్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.

