బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి: నారా లోకేశ్

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి: నారా లోకేశ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు’ థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.రాష్ట్రంలోని 1,875 క్లస్టర్ ఇంఛార్జ్‌లతో నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన పొదుపు అవసరాల దృష్ట్యా ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాల్లో కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొంటారని తెలిపారు.ప్రతి కేంద్రంలో ఎల్ఈడీ టీవీలు, సౌండ్ సిస్టమ్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పార్టీ జెండాలు, బ్యానర్లు, అలంకరణలతో మహానాడు వేదికలను పండుగలా తీర్చిదిద్దాలని కోరారు. కార్యకర్తల ఐక్యత, పార్టీ బలాన్ని చాటే వేదికగా మహానాడు నిలవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్