బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

చైనాలో విషాదం.. గని పేలుడులో 82 మంది మృతి

చైనాలో విషాదం.. గని పేలుడులో 82 మంది మృతి

మే 23, (నేటి తెలుగు పత్రిక): చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. లూషెన్యు బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి 82 మంది కార్మికులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రమాద సమయంలో గనిలో వందలాది మంది కార్మికులు పనిచేస్తుండగా, విషవాయువు వేగంగా వ్యాపించడంతో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి.సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రత్యేక రక్షణ పరికరాలతో గనిలోకి వెళ్లి చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనతో చైనాలో గనుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై చైనా ప్రభుత్వం అత్యవసర విచారణకు ఆదేశించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ