బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా టీడీపీ మహానాడు: పల్లా శ్రీనివాసరావు

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా టీడీపీ మహానాడు: పల్లా శ్రీనివాసరావు

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లను మహానాడుతో అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 1851 క్లస్టర్లలో సాంకేతిక అనుసంధానం పూర్తయ్యిందని చెప్పారు. నెట్‌వర్క్ సమస్య ఉన్న 24 క్లస్టర్ల ప్రతినిధులను మండల కేంద్రాలకు తీసుకువచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.ఈసారి మహానాడు ‘మహిళా శక్తి’ ప్రధాన థీమ్‌తో జరగనుందని పేర్కొన్న ఆయన.. రెండు రోజుల పాటు మొత్తం 20 తీర్మానాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. మహిళా సాధికారత, అమరావతి, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి, వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై ప్రత్యేక చర్చ ఉంటుందని చెప్పారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహానాడు కార్యక్రమాలు కొనసాగుతాయని, పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని క్లస్టర్లను సాంకేతికంగా అనుసంధానం చేశామని పల్లా శ్రీనివాసరావు వివరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్