బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

శస్త్రచికిత్స తర్వాత కోలుకుని సోనియా గాంధీ డిశ్చార్జ్

శస్త్రచికిత్స తర్వాత కోలుకుని సోనియా గాంధీ డిశ్చార్జ్

న్యూఢిల్లీ, మే 31, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ విజయవంతమైన కంటి శస్త్రచికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తన నివాసానికి చేరుకున్నారు.వైద్యుల సూచన మేరకు ఢిల్లీలోని ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీకి కంటి ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. అనంతరం ఆమె తన అధికారిక నివాసమైన 10 జన్‌పథ్‌కు చేరుకున్నారు.కొంతకాలంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కూడా ఆమె బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చికిత్స సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సూచన మేరకు కొంతకాలం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. పూర్తిస్థాయిలో కోలుకున్న అనంతరం ఆమె రాజకీయ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ