Breaking News

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం

ఎ. కొండూరు మార్చి 29 (నేటి తెలుగు పత్రిక): అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుదేశం పార్టీ నిస్థాపించి నేటికి 44 ఏళ్లు నిండింది అని ఎ కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు భరోతు పీక్లా నాయక్ ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి అలవాల రమేష్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన ఎ. కొండూరు లో తెలుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవన్ని టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజకీయ నేతలను చేయడం లో తెలుగు దేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని అన్న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించిన నాటి నుండి పేదలకు కూడు గూడు గుడ్డ నినాదంతో పని చేసింది అని అన్నారు. డిల్లీ పాలకుల మెడలు వంచి పార్టీని స్థాపించిన అనతి కాలంలో అధికార పీఠం చేజిక్కించుకొని కరణం పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత తెలుదేశం పార్టీ దని అన్నారు మామ నడిపిన బాటలో పార్టీని అకుంఠిత మైన దీక్ష పట్టుదలతో తెలుదేశం పార్టీని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందనిఅన్నారు. తాతకు తగ్గ మానవడిల తండ్రి కి తగ్గ తనయుడిల, ఐటీ విద్య శాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నికంటికి రెప్పల కాపాడుతూ నిత్యం కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు గత ప్రభుత్వం చేసినవికృత చేష్టలను యువగళం పాద యాత్ర ద్వారా ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చే విధంగా తనవంతు కృషి చేసిన నాయకుడు లోకేష్ అన్నారు, టీడీపీ పార్టీలో ప్రతి కార్య కర్త అంకిత భావంతో పని చెయ్యాలని రానున్న రోజులు పార్టీ స్థాయిని అగ్రస్థానంలో నిలిపే బాధ్యత కార్యకర్తలదే అని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణంలో తనదైన మార్క్ పాలనతో ముందుకు వెళుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం టీడీపీ పార్టీలో సీనియర్ నాయకులను సన్మానించారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *