Breaking News

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

ఎ. కొండూరు మార్చి 29 (నేటి తెలుగు పత్రిక): చీమలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.చీమలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండపాటి సుబ్బారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జండా ఎగరవేయడం జరిగింది అనంతరం కార్యకర్తలకు నాయకులకు పళ్ళు మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చీమలపాడు పిఎసిఎస్ అధ్యక్షుడు బెజవాడ శంకర్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ అవతరించింది అన్నపార్టీ పెట్టిన తర్వాతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పిటిసిలుగా మండల పరిషత్ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ చైర్మన్ లు గా రాజకీయంగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. అంటే అది అన్న ఎన్టీఆర్ ఘనత అనిగర్వంగా చెప్పుకుంటున్నాము అంతేకాకుండా పటేల్ పట్వారి కరణం మున్సిబులవ్యవస్థ తీసేసి తాహశీల్దార్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు పరిపాలన దగ్గరగా చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నుండి తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ విడదీయలేరు అనేది వాస్తవం అని ఈ సభాముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంకా మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ షేక్ సుభాని మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పంబ గిరిబాబు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సూరిశెట్టి సుబ్బారావు ఉయ్యూరు సోమయ్య మరీదు వెంకట్రావు పోతనబోయిన నరసింహారావు బెజవాడ ఆదిశేషు షేక్ బాబు పామర్తి సుబ్బారావు ఇంకా కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *