Breaking News

Choree at the former MLA Jaypal Yadav house

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును అపహరించుకుపోయారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దొంగతనానికి సంబంధించి ఆధారాలను సేకరించేందుకు సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.

జైపాల్ యాదవ్ నివాసంలో జరిగిన ఈ చోరీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *