Breaking News

KTR does not even bail out the mistake

కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదు

కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీలోకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద తప్పు చేసినట్లు ఆరోపించారు. ఆయన జైలుకే వెళ్లక తప్పదని, కేటీఆర్ చేసిన తప్పుకు బెయిల్ కూడా రాదని అన్నారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించడం పై వ్యంగ్యంగా స్పందించిన కోమటిరెడ్డి, శబరిమల వెళ్లినట్లు నల్ల దుస్తులు వేసుకున్నారని విమర్శించారు. కేటీఆర్ అరెస్టు అయితే బెయిల్ రావాలని మొక్కుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే అవకాశం లేదని మంత్రి తెలిపారు.

ఇక ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. ఏసీబీ ఎప్పుడు నోటీసులు జారీ చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఉచ్చు బిగుస్తోందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *