Breaking News

They are trying to topple the Sarkar like it was done in the movie.

సినిమాలో చేసినట్లుగా సర్కార్‌ను కుప్ప కూల్చాలని చేస్తున్నారు.

అల్లు అర్జున్ కేసు వెనుక మహా శక్తి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, డిసెంబర్ 24:
అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రెస్ మీట్ ద్వారా మీడియా ఎదుట ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్రలు జరుగుతున్నాయి అని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.

అల్లు అర్జున్ వెనుక ఓ మహా శక్తి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చింది.

తాసిల్దార్ కు సన్మానం.

పదేపదే వివాదంలోకి అల్లు అర్జున్
ఈ నేపధ్యంలో మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, అల్లు అర్జున్‌ను విచారించారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు అల్లు అర్జున్ అరెస్ట్ అంశాన్ని వాడుకుంటున్నారు అని ఆరోపించారు. పుష్ప సినిమాలో చూపినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు.

మహా కుట్ర ఆరోపణలు
గడచిన 24 గంటలుగా పెద్ద కుట్రలు నడుస్తున్నాయని, రాబోయే వారం రోజుల్లో రేవంత్ సర్కార్‌పై భారీ ప్రణాళిక అమలు కానుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నాయని విమర్శించారు. అల్లు అర్జున్‌కు పక్క రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తోందని అన్నారు.

తెలంగాణ సమాజానికి పిలుపు
అయితే బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది తెలంగాణ ప్రజలేనని పిలుపునిచ్చారు. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలిచేవారు తెలంగాణ ద్రోహులు కాబడతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తనపై ఎలాంటి కేసులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కగా, ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *