Breaking News

Heavy security in Medak district...celebrity visit.

మెదక్ జిల్లాలో భారీ బందోబస్తు…ప్రముఖుల పర్యటన.

మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) ప్రముఖుల పర్యటన: భారీ బందోబస్తు

మెదక్ జిల్లా బుధవారం రేపు పలువురు ప్రముఖులను స్వాగతించేందుకు సన్నద్ధమైంది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మరియు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్ పర్యటన సందర్భంగా, తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో 500 మంది రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించబడుతుంది. వారు సేంద్రీయ పంటల మీద చర్చిస్తారు. ఇప్పటికే హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. కేంద్ర బలగాలు ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు పర్యటించనున్నారు. ఏడు పాయల ఆలయం వద్ద సీఎం రాక కోసం హెలిప్యాడ్ సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొంటారు. ఆ తర్వాత, క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఈ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమేకాకుండా, ఇతర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *