తిరుమల శ్రీవారికి భక్తుల నుండి భారీ విరాళాలు
తిరుమల, డిసెంబర్ 25:
తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుండి భారీ విరాళాలు వస్తూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లోనే ఇద్దరు భక్తులు కలిపి రూ.2 కోట్లకు పైగా విరాళాలను టీటీడీకి అందించారు.
తాజాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈఓ పీ.ఎం.ఎస్. ప్రసాద్ తిరుమల శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,11,11,111 విరాళంగా అందజేశారు. బుధవారం ఈ విరాళాన్ని టీటీడీ అధికారులకు పీఎంఎస్ ప్రసాద్ స్వయంగా అందజేశారు.
ఈ విరాళాలు తిరుమలలో భక్తుల సేవలకు, అన్నప్రసాదం ఏర్పాట్లకు ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు.