Breaking News

Union Minister Kishan Reddy is unhappy with the Congress rule - Kishan Reddy

ఎన్నికల హీట్… రేపు బీజేపీ కీలక సమావేశం

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ – బీజేపీ వ్యూహాలపై కీలక భేటీ

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల వేడి పెరుగుతోంది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ (BJP) పోటీపడుతున్నాయి. తమ ఖాతాలో ఈ మూడు స్థానాలను వేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది.

కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం

ఈ నేపథ్యంలో రేపు బీజేపీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరగనుంది.

కేసీఆర్‌తోనే నాకు గుర్తింపు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చ

ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పదాధికారులు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో కీలక చర్చలు జరగనున్నాయి.

పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక ప్రణాళిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేరువయ్యేలా వ్యూహాలను రూపొందించేందుకు ఈ భేటీలో ప్రత్యేక చర్చ జరుగుతుందని సమాచారం.

హేట్ స్పీచ్ బిల్లు’పై కేటీఆర్ ఫైర్.. ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శ

ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముండటంతో, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *