Breaking News

Every worker is supported by the party.

ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.

పార్టీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుంది.

అదైర్యపడొద్దు ఆరోగ్యం జాగ్రత్త..

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

తొగర్రాయి గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.
కోదాడ ,ఫిబ్రవరి 7 (నేటి తెలుగు పత్రిక.)
కోదాడ మండల పరిధిలోని తోగర్రాయి గ్రామశాఖ అధ్యక్షులు అమరబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వెన్నెముక ఆపరేషన్ చేపించుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటానని అధైర్యపడొద్దని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని మనోధైర్యాన్ని కల్పించి వారి కుటుంబానికి బాసటగా ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ సర్పంచులు దొంగల లక్ష్మీనారాయణ, పొట్టా విజయ కిరణ్, మాజీ సొసైటీ చైర్మన్ ముత్తవరపు రమేష్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఉద్దండు, పట్టణ యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్,పట్టణ నాయకులు మాదాల ఉపేందర్, కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *