|| Srirangapuram Anjaneyaswamy Temple Anniversary Mural Inauguration ||
వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 23న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం
అన్నదాన ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే పద్మావతి
ఆంజనేయస్వామి నూతన చైర్మన్ కమిటీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు
కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక).
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం అభయ ఆంజనేయ స్వామి ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల గోడపత్రికను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్నేని బాబు ,ఆలయ నూతన చైర్మన్ కుర్రి గోపయ్య యాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు చిత్తలూరి శివయ్య లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బాబు మాట్లాడుతూ ఈ నెల 23న తాను దాతగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పద్మావతి హాజరుకానున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఆలయాలు వార్షిక వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్ కొర్రి గోపయ్య యాదవ్, పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.
