ఆధార్ అప్డేట్ సేవకు గడువు పొడగింపు: 14 జూన్ 2025 వరకు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును మరోసారి పొడిగించింది.
మొదట నిర్ణయించిన 14 డిసెంబర్ 2024 గడువు ఈ నెలతో ముగియనున్నది. అయితే, ఈ గడువును 14 జూన్ 2025 వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పౌరులు తమ ఆధార్ లో వివరాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆధార్ లో పేరులో మార్పు, వయస్సు, చిరునామా వంటి వివిధ వివరాలను ఉచితంగా మార్చుకోవచ్చు.
పౌరులు ఈ మార్పులు UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా ఆధార్ సేవా కేంద్రాలు ద్వారా సులభంగా చేయవచ్చు.