కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్
అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో స్పందించారు.
“గతంలో వైసీపీ ఎంపీలను విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు?” అని రోజా నిలదీశారు.
🔹 “అప్పుడు పవన్.. ‘రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి’ అన్నారు. మరి ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీలకు అదే మాటలు చెప్పగలరా?” అంటూ రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
🔹 “గతంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ఉన్నప్పటికీ, వైసీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన హామీలను నిలబెట్టాలని నిరంతరం డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఏపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రం నడుస్తోంది. మరి పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?” అని రోజా ప్రశ్నించారు.
ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులు ఈ విధంగా ఉన్నాయి:
📌 పోలవరం ప్రాజెక్ట్ – ₹5,936 కోట్లు
📌 పోలవరం బ్యాలెన్స్ గ్రాంటు – ₹12,157 కోట్లు
📌 విశాఖ ఉక్కు ప్లాంట్ – ₹3,295 కోట్లు
📌 విశాఖ పోర్ట్ – ₹730 కోట్లు
📌 ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి – ₹162 కోట్లు
📌 జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ – ₹186 కోట్లు
📌 లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఆపరేషన్ – ₹375 కోట్లు
📌 రహదారులు, వంతెనల నిర్మాణం – ₹240 కోట్లు
📌 ఏపీ ఇరిగేషన్ & లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (రెండో దశ) – ₹242.50 కోట్లు