బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

ఇండియన్ ఆయిల్ కొత్త నిర్ణయం.. గ్యాస్ కష్టాలకు చెక్

ఇండియన్ ఆయిల్ కొత్త నిర్ణయం.. గ్యాస్ కష్టాలకు చెక్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని మరింత సులభం చేసింది. ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ కోసం ముందుగా బుకింగ్ చేసి, డెలివరీ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ కొత్త విధానంలో అలాంటి అవసరం లేదు. వినియోగదారులు నేరుగా సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్‌ను వెంటనే పొందవచ్చు.ఈ సిలిండర్ ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ కేటగిరిలో ఉండటంతో, కేవలం ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. అడ్రస్ ప్రూఫ్ లేదా ఇతర పత్రాలు అవసరం లేదు. అంతేకాదు, రీఫిల్ కోసం ఒకే డిస్ట్రిబ్యూటర్ వద్దకు పరిమితం కాకుండా, ఎక్కడైనా సులభంగా గ్యాస్ నింపించుకునే అవకాశం ఉంది.ఇండేన్ డిస్ట్రిబ్యూటర్లు, అనుమతిపొందిన అవుట్‌లెట్లు, కొన్ని కిరాణా దుకాణాల్లో కూడా ఈ సిలిండర్ లభిస్తుంది. దీంతో అత్యవసర సమయంలో గ్యాస్ కొరతతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా, వెంటనే పరిష్కారం లభిస్తుంది.ప్రత్యేకంగా వలస కార్మికులు, చిన్న కుటుంబాలు, తరచూ నివాసం మారే వారికి ఈ చిన్న సిలిండర్ ఎంతో ఉపయోగకరంగా మారనుందని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు