Breaking News

Bhatti future CM : Harish Rao sensational comments

భట్టినే భవిష్యత్తు సీఎం హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

భట్టినే భవిష్యత్తు సీఎం: అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణలో భవిష్యత్తులో భట్టి విక్రమార్కనే ముఖ్యమంత్రి అవుతారంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బ్లాక్ షర్టులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా, ఈ సందర్భంలో హరీష్ రావు మాట్లాడారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

“భట్టి విక్రమార్క సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఆయనే సీఎం అవుతారు” అని హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. అలాగే ఈ తరహా పాలన కొనసాగితే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్ల అప్పు అవుతుందని ఆయన వివరించారు.

ఇక లగచర్ల ఘటనపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వినూత్న నిరసన చేపట్టారు. బ్లాక్ షర్టులతో పాటు చేతులకు బేడీలు వేసుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *