Breaking News

Ex-minister's perni nani sensational comments

గోడౌన్ అద్దె వివాదం..స్పందించిన పేర్ని నాని

గోడౌన్ అద్దె వివాదం: పేర్ని నాని స్పందన

మచిలీపట్నంలో తన భార్య జయసుధ పేరు మీద గోడౌన్‌ను అద్దెకు ఇచ్చిన విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ 10న ఆ గోడౌన్ అద్దెకు తీసుకున్నారని, ఇది పూర్తిగా నైతిక బాధ్యతగా తీసుకున్న చర్య అని స్పష్టం చేశారు.

గోడౌన్‌ నిర్మాణం వివరాలు
“60 సంవత్సరాల క్రితం మా అత్తమామలు నిర్మించిన గోడౌన్‌ మాకు ఇచ్చారు. తమ వయసు దృష్ట్యా పనులు నిర్వహించలేకపోవడంతో, అద్దె ద్వారా ఆదాయం పొందే ఉద్దేశంతో నిర్మాణం చేశారు. నేను, నా భార్య రోజూ వెళ్లి చూసేదేమీ ఉండదు. స్టాక్‌లో సమస్యలు ఉన్నాయని మా మేనేజర్ ద్వారా తెలిసింది” అని నాని వివరించారు.

నైతిక బాధ్యతతో చర్యలు
నవంబర్ 26న జాయింట్ కలెక్టర్‌కు మా తరపున ప్రతినిధి పత్రం సమర్పించాం. స్టాక్ లోపం తెలిశాక, తాము నైతిక బాధ్యత వహిస్తూ లేఖ ఇచ్చామని, అవసరమైన డబ్బులు కూడా జమ చేశామని అన్నారు. కానీ, కింద స్థాయి అధికారులు క్రిమినల్ కేసు పెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు.

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

అవాస్తవ ఆరోపణలపై ఆగ్రహం
“సోషల్ మీడియాలో నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను, నా భార్య ఎలాంటి తప్పూ చేయలేదు. రాజకీయ కక్ష్యతో, నన్ను, నా భార్యను అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నా భార్య మీద కేసు పెట్టడం తప్ప, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చట్టవిరుద్ధం” అని మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు దృష్టికి విషయం
ఈ విషయంలో సీఎం చంద్రబాబుతో మాట్లాడినప్పుడు, ఆయన ఇంట్లో ఆడవాళ్ల మీద కేసులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారని నాని తెలిపారు. “చంద్రబాబు నా మీద వైరం ఉంటే నన్ను చూడండి, కానీ నా భార్యను ఈ వివాదంలోకి లాగడం తగదని చెప్పి వెళ్లిపోయారు” అని పేర్కొన్నారు.

అరెస్టులపై నాని వ్యాఖ్యలు
“నన్ను, నా కొడుకును **అరెస్టు చేయడమే మీకెంతో అవసరమైతే, చేయండి. మీకు చేతనైనంత చేస్తారు, నా మీద నమ్మకం ఉంది. తప్పుడు పనులు చేసే వ్యక్తిని కాదు. ఒక మాజీ మంత్రిగా నేను నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించా. కానీ, ఇప్పుడు రాజకీయ కక్ష్యతో నాపై ఆరోపణలు చేస్తున్నారని” ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు విచారణ కారణంగా మౌనం
“ఈ వివాదంపై ముందే స్పందించాలని అనుకున్నా, కోర్టు విచారణ కొనసాగుతుండటంతో మా లాయర్లు చర్చలు నిలిపివేయాలని సూచించారు. నా వాదనలు ప్రజలకు వెల్లడించడానికి ఇదే సరైన సమయం” అని నాని స్పష్టం చేశారు.

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

తేలికపాటి ఆరోపణలు చేయడం మంచిది కాదు
తాము నైతికంగా, చట్టపరంగా తప్పుల్లేని నిర్ణయాలు తీసుకున్నామని, కానీ రాజకీయ కక్ష్యతో ఈ వ్యవహారం కావాలని రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *