జబర్దస్త్ కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు రాంప్రసాద్. గురువారం ఆయన షూటింగ్ కోసం తుక్కుగూడ ORR గుండా కారులో వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేసింది. దీంతో రాంప్రసాద్ కారు ఆ కారుని ఢీ కొట్టింది. వెనుక నుండి వస్తున్న మరో ఆటో కూడా కారుని ఢీ కొట్టడంతో కారు డ్యామేజ్ అయ్యింది. రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు.
