కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో నిందితులకు ప్రాసిక్యూషన్ ఉపయోగించని పత్రాలను ఇవ్వాలని ట్రయల్ కోర్టు జారీచేసిన ఆదేశాలను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై స్పందించాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు కవిత, మాజీ సీఎం అరవింద్ కేజీవాల్ సహా పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని ఈడీ చేసిన అభ్యర్థనపై కూడా 40 మంది నిందితులకు జస్టిస్ మనోజ్కుమార్ ఓహ్రీ నోటీసులు జారీచేశారు.