Breaking News

Time has been finalized for expansion of Telangana cabinet

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు – కీలక నేతల ఢిల్లీ పర్యటన

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఏఐసీసీ నేతలతో భేటీ

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మరికొందరు కీలక నేతలు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు.

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

రేపు ఖర్గే, రాహుల్‌తో భేటీ

రేపు (శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ సభ్యుల ఎంపిక జరగనున్నట్లు సమాచారం. ఇంకాస్త సమన్వయం కోసం ఇన్‌చార్జ్ మున్షీ ఇప్పటికే ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది.

కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ

తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ఎవరు మంత్రులు అవుతారు? అనే చర్చ ఊపందుకుంది. రేపటి ఏఐసీసీ భేటీ తర్వాత ఈ విషయంలో స్పష్టత రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *